అంతా ఇష్టారాజ్యం
న్యూస్‌రీల్
యాదగిరీశుడి కొండపైన కొబ్బరికాయల వ్యాపారులు భక్తులను నిలువునా దోచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025
- 8లో
మోటకొండూర్: మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాఠశాలలో ఆరు గదులు, క్రీడా ప్రాంగణం, ప్రహరీ, బాత్‌రూమ్స్ ఇలా అన్ని వసతులు ఉన్నప్పటికీ ఎంపీడీఓ కార్యాలయం అందులోనే నిర్వహిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఈ పాఠశాలలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తరగతి గదులు లేక తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఈఏడాది పెరిగిన విద్యార్థుల సంఖ్య
మోటకొండూర్ ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం 44 మంది విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య 71కి చేరింది. నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. 2016లో మోటకొండూరు నూతన మండలంగా ఏర్పడగా ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కొరతతో ప్రాథమిక పాఠశాల ఆరు గదుల్లోనే నాలుగు గదులను ఎంపీడీఓ కార్యాలయానికి కేటాయించారు. మిగతా రెండు గదుల్లోని ఒక గదిలో పాఠశాల ఆఫీస్ రూమ్, కిచెన్, 1, 2 తరగతులకు సంబంధించి 30 మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మరొక గదిలో 3, 4వ తరగతులకు సంబంధించి 21 మంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇక 5వ తరగతికి చెందిన 18 మంది విద్యార్థులకు పాఠశాల వరండాలోనే బోధిస్తున్నారు. సరిపడా తరగతి గదులు లేవన్న కారణంతో 8 మంది విద్యార్థులు తిరిగి వెళ్లిపోయారు.
బ్లాక్ బోర్డుల సమస్య
విద్యార్థులకు బోధించేందుకు వీలుగా ప్రతిగదికి ఒక బోర్డు చొప్పున అందిస్తాయి. మోటకొండూర్ పాఠశాలలోని ఐదు తరగతులకు 5 బోర్డులు ఇవ్వాల్సి ఉండగా.. పాఠశాలకు రెండు గదులు మాత్రమే కేటాయించటంతో బోర్డులు కూడా రెండు మాత్రమే ఇచ్చారు. ఆవరణలో పాఠాలు వింటున్న వారికి బోర్డు కేటాయించాలని ఎంఈఓను కోరగా.. అమ్మనబోలు స్కూల్ నుంచి ఒక బ్లాక్ బోర్డ్‌ను ఇప్పించారు. కానీ ఇది పెట్టేందుకు ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ఉపయోగించటానికి కష్టంగా మారింది.
మోటకొండూర్ ప్రభుత్వ ప్రాథమిక
పాఠశాలలో గదుల కొరత
70 మంది విద్యార్థులకు రెండే గదులు
నాలుగు గదులు ఎంపీడీఓ
కార్యాలయానికి కేటాయించడంతో తలెత్తుతున్న ఇబ్బందులు
గదులు లేక తిరిగి వెళ్లిపోతున్న
విద్యార్థులు
తరగతి గదులు కేటాయిస్తే ఇంకో
25 మంది వరకు వచ్చే అవకాశం
భారంగా ప్రయాణ ఖర్చు..
మోటకొండూర్‌లో చదువుకునేందుకు ముస్త్యాలపల్లి గ్రామం నుంచి 16 మంది విద్యార్థులు వస్తుంటారు. అందులో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు 9 మంది, ఏడుగురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రామం నుంచి మోటకొండూర్‌కు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నెలకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున చెల్లిస్తూ ప్రైవేట్ వాహనంలో వస్తున్నారు. అయితే పాఠశాల ఊరికి దూరంగా ఉండటంతో హైస్కూల్ నుంచి ప్రైమరీ వరకు ఉన్న కొంతమంది చిన్నారులను తీసుకురావటానికి టీచర్‌లు నెలకు 2500 అదే వ్యాన్‌కు చెల్లిస్తూ తీసుకువచ్చి దిగబెడుతున్నారు.
అంతా ఇష్టారాజ్యం
అంతా ఇష్టారాజ్యం


