వానొస్తే రాస్తా బంద్
రామన్నపేట: వానపడితే రామన్నపేట – సిరిపురం రైల్వే అండర్‌పాస్ నీళ్లతో నిండిపోతోంది. అందులోనుంచి వెళ్లేందుకు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. లోతు తెలియక కొందరు వెనక్కి తగ్గుతుండగా.. అలాగే వెళ్లిన వారు నీటిలో చిక్కుకుంటున్నారు. మెంథా తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు అండర్‌పాస్ పూర్తిగా జలమయం అయ్యింది. ఫలితగా ఆ మార్గంలో ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం వచ్చిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
నిర్మాణలోపం వల్లే సమస్య!
రామన్నపేట – చౌటుప్పల్ మార్గంలో సిరిపురం వద్ద ఐదేళ్ల క్రితం రైల్వేశాఖ అండర్‌పాస్ నిర్మించింది. రెండువైపులా మలుపు వచ్చినా పట్టించుకోకుండా అండర్‌పాస్ నిర్మాణం చేశారు. వర్షపునీరు వెళ్లడానికి వీలుగా డ్రెయిన్ ఏర్పాటు చేసి సమీపంలోని కుంటలోకి కలిపారు. వర్షాలు అధికంగా కురిసినప్పుడు కుంట నిండి అండర్‌పాస్ నుంచి నీళ్లు ముందుకెళ్లడం లేదు. ఈనెల 28,29 తేదీల్లో కురిసిన వర్షాలకు అండర్‌పాస్‌లో భారీగా నీళ్లు నిలిచాయి. దీంతో ఈ రూట్‌లో నడిచే ఏకై క ఆర్టీసీ బస్సును అధికారులు రద్దు చేశారు. విద్యార్థులు, వాహనదారులు బోగారం, కొమ్మాయిగూడెం లేదా పెద్దకాపర్తి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. లోతు తెలియక అండర్‌పాస్ గుండా వెళ్లడానికి ప్రయత్నించిన వాహనాలు నీళ్లలో ఆగిపోతున్నాయి. వెల్లంకి గ్రామానికి చెందిన దంపతులు అండర్‌పాస్ మధ్యలోకి వెళ్లాక బైక్ అదుపుతప్పి నీళ్లలో పడి గాయాల పాలయ్యారు. ఓ కారు కూడా నీళ్ల మధ్యలోకి వెళ్లిన తరువాత మొరాయంచి ఆగిపోయింది. సమస్యకు శాశ్వత పరిష్కారం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ వర్షాలకు నిండిన రామన్నపేట –సిరిపురం రైల్వే అండర్‌పాస్
ఫ ఐదు రోజులుగా రాకపోకలు బంద్
ఫ చుట్టూ తిరిగి వెళ్తున్న జనం


