40 వసంతాల అపూర్వ కలయిక
ఆలేరురూరల్ : మండలంలోని శారాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాల 1985–86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సైదా బేగం, పాములపర్తి రాంచంద్రారెడ్డి, దయ్యాల దేవేందర్, తమ్మలి ఆశయ్య, కాండ్రాజు సత్తయ్య, చెన్నోజు శ్రీనివాస్, దోడ కొండయ్య, మద్దెల శ్రీనివాస్, నవనీత, స్వరూప, కళాభాయ్, సయ్యద్ అభ్బాస్, శ్రీనివాస్, చంద్ర రుషి, కొండల్‌రెడ్డి, దూడల జంగయ్య, నీలేందర్‌రెడ్డి, సాయిరెడ్డి, మాల్లారెడ్డి, హేమలత, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.


