కంటి సమస్య ఉన్నవారు అధైర్యపడొద్దు
చౌటుప్పల్ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారెవరూ అధైర్యపడొద్దని, అందరికీ తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో గల పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటికే తొమ్మిది విడతలుగా నియోజకవర్గంలో శిబిరాలు నిర్వహించి 6,618 మందికి పరీక్షలు చేశామని, అందులో 1330మందికి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ప్రస్తుతం లక్కారంలో పదో విడత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలకు కంటి చూపు సమస్య ఉండకూడదన్నదే తన లక్ష్యమన్నారు. కంటిచూపు బాగుంటే పదేళ్లపాటు అధికంగా జీవించొచ్చని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, తాడూరు వెంకట్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ పబ్బు రాజుగౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, నాయకులు చెన్నగోని అంజయ్య, మొగుదాల రమేష్, జాల మల్లేష్, అర్ధ వెంకట్‌రెడ్డి, బత్తుల విప్లవ్‌కుమార్, పెద్దగోని రమేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


