గంధం ఊరేగింపు
భువనగిరి : భువనగిరి పట్టణంలో ఆదివారం స్థానిక గంజ్ మసీదు వద్ద గంధం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిరాజ్ ఓ ఓలియా కదబుద్దీన్ ఒలియా గంధం, పూలచదర్‌ను హజరత్‌కు సమర్పించారు. కార్యక్రమంలో ఖాజా బషీర్ ఉద్దీన్, అమీన్‌మెమన్,ఇబ్రహీం అనీఫ్,ఇమ్రాన్, షరీఫ్, రహమాత్‌అలీ పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రైవేట్
కళాశాలలు బంద్
భువనగిరి: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, నర్సింగ్ కళాశాలలు బంద్‌లో పాల్గొంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.


