డ్రయ్యర్ ట్రయల్ రన్
చౌటుప్పల్: ‘నిరుపయోగంగా డ్రయ్యర్‌లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ అధికారులు స్పందించారు. మార్కెట్ యార్డులో నిర్మించిన గోదాంలో ఉంచిన డ్రయ్యర్‌ను శనివారం యార్డులోకి తీసుకొచ్చారు. మార్కెట్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్‌తో పాటు డ్రయ్యర్ కోసం 40లీటర్ల డీజిల్‌ను తెప్పించారు. ట్రాక్టర్ ట్రాలీ నిండుగా ఉన్న ధాన్యాన్ని డ్రయ్యర్‌లో నింపారు. డ్రయ్యర్ వినియోగంపై రైతులు అవగాహన కల్పించారు.
డ్రయ్యర్ ట్రయల్ రన్


