● పోలీస్ అమరులను స్మరించుకుంటూ..
హామీలన్నీ అమలు చేస్తాం
మోటకొండూర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నూతన తహసీల్థార్, ఎంపీడీఓ కార్యాలయాల భవన నిర్మాణాలకు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. రూ.10 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో పాటు రూ.250 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు కూడా మంజూరు చేయించామన్నారు. ప్రజాపాలనలో భాగంగా పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సాకారం చేస్తున్నామన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం, మహిళకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు వడ్డీలేని రూణాలు అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భవిష్యత్‌లో మంత్రిగా ఎదగాలంటే ఇక్కడి ప్రజలంతా ఆయనకు అండగా ఉండాలని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి కేసీఆర్ ఆండ్ కో మాత్రం రూ.లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. మోటకొండూర్ మండల కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయటం ఇందుకు నిదర్శనమన్నారు.
రెండేళ్లలో ఎంతో అభివృద్ధి
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసి చూపిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో రూ.10 కోట్ల వ్యయంతో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోపు మార్కెట్ యార్డు, పీఏసీఎస్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ నూతన భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి అధికారులు కృషి చేయాలన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందించారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు ఝెల్లంల సంజీవరెడ్డి, బీర్ల శంకర్, అదనపు కలెక్టర్‌లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, ఆలేరు, మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్‌లు ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, విమల వెంకటేష్, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీఓ ఇందిర, పచ్చిమట్ల మదార్‌గౌడ్, కొంతం మోహన్‌రెడ్డి, గంగపురం మల్లేష్, నెమ్మాణి సుబ్రమణ్యం, భాస్కరుణి రఘునాథరాజు, సిరబోయిన మల్లేష్ యాదవ్, తండ పాండురంగయ్య గౌడ్, భూమండ్ల శ్రీనివాస్, బాల్ధ రామకృష్ణ, ఆరె ప్రశాంత్‌గౌడ్, గుండ్లపల్లి భరత్, బి.అశోక్, పి.కార్తీక్, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మోటకొండూరులో ఎంపీడీఓ,
తహసీల్దార్ కార్యాలయాల
నిర్మాణానికి భూమిపూజ
● పోలీస్ అమరులను స్మరించుకుంటూ..
● పోలీస్ అమరులను స్మరించుకుంటూ..
● పోలీస్ అమరులను స్మరించుకుంటూ..


