లకీ్కగా వరించిన కికు్క
భువనగిరి : కొత్త మద్యం దుకాణాలకు టెండర్ల వేసిన దరఖాస్తుదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో 82 మద్యం షాపులకు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించగా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఈ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగేలా ట్రాఫిక్ సమస్యతోపాటు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెండర్ల కోసం దరఖాస్తు వేసిన వారిని మాత్రమే ఫంక్షన్ హాల్‌లోకి అనుమతించారు. దీంతో ఫంపక్షన్ హాల్ దరఖాస్తులదారులతో నిండిపోయింది. లాటరీ పద్ధతిలో షాపుకు ఎంపికై న వారు కేరింతలు చేస్తుంటే ఎంపిక కానివారు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారి విష్ణుమూర్తి, ఏసీపీ రాహుల్‌రెడ్డి, రూరల్ సీఐ చంద్రబాబు, ఎకై ్సజ్ శాఖ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
లక్కీ లాటరీలో విశేషాలు..
● చౌటుప్పల్ మండలం ఎల్లంబావి మద్యం షాపునకు అత్యధికంగా 91 దరఖాస్తులు రాగా ఈ షాపు వలిగొండకు చెందిన పోలు అండాలుకు లాటరీ ద్వారా లక్కు దక్కింది. అలాగే 83 దరఖాస్తులతో రెండో స్థానంలో ఉన్న అరూర్ మద్యం షాపు వలిగొండలోని బీసీ కాలనీకి చెందిన మైసోళ్ల ప్రవీణ్‌కు దక్కింది. ఇతడు ఈ షాపుకు ఒకటే దరఖాస్తు వేయడం ఎంపిక కావడం విశేషం.
● ఈ సారి మద్యం షాపుల ఎంపిక 22 మంది మహిళలకు అదృష్టం వరించింది. ఇందులో యువతులు సైతం ఉన్నారు. సెంటిమెంట్ పనిచేస్తుందని చాలా వరకు వ్యాపారులు మహిళలు, యువతుల పేరు మీదగా దరఖాస్తులు వేశారు.
● మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ భువనగిరి, రామన్నపేట, ఆలేరు, మోత్కూర్ ఎస్‌హెచ్‌ఓ క్రమంలో ఎంపిక చేశారు. ఆయా ఎస్‌హెచ్‌ఓ పరిధిలో ఉన్న షాపులకు 15 నంబర్ గల వారికి ఎక్కువగా షాపులు దక్కాయి.
● మద్యం షాపులను దక్కించుకునేందుకు ఎక్కువగా 10 నుంచి 20 మంది వ్యాపారుల వరకు సిండికేట్‌గా మారి టెండర్లు వేశారు. ప్రతి సిండికేట్ గ్రూపునకు 3 నుంచి 6 వరకు షాపులు దక్కాయి.
● ఈ సారి పాత వ్యాపారుల కంటే కొత్త దరఖాస్తుదారులకు ఎక్కువగా షాపులు దక్కాయి.
● లక్కీ డ్రాలో భార్యభర్తలకు ఆత్మకూర్(ఎం)లో ఒకరికి, మోత్కూరులో మరొకరి షాపులు దక్కడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
● మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30వరకు నిర్వహించుకోనున్నారు.
ప్రశాంతంగా మద్యం షాపుల లక్కీ డ్రా
రెండు గంటల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి
కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో దుకాణాలు కేటాయింపు
లకీ్కగా వరించిన కికు్క


