చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
సాక్షి, యాదాద్రి : రైతుల పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు, అలాగే పత్తి కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలపై సోమవారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటావేసి మిల్లులకు తరలించాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్ష సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, ఏసీపీ రాహుల్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, డీఎస్‌ఓ రోజారాణి, డీఏఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా నిర్వహించాలి
రాష్ట్రంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష


