బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
హాలియా: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. ఎస్‌ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఆడపు వెంకటయ్య(55) శనివారం బైక్‌పై గుర్రంపోడులో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


