అప్పు చేసి.. జూదం ఆడి | - | Sakshi
Sakshi News home page

అప్పు చేసి.. జూదం ఆడి

Oct 26 2025 9:23 AM | Updated on Oct 26 2025 9:23 AM

అప్పు చేసి.. జూదం ఆడి

అప్పు చేసి.. జూదం ఆడి

ఆలేరు: అప్పు చేసి జూదం ఆడి లక్షల రూపాయలు నష్టపోయిన వ్యక్తిని అప్పు ఇచ్చినవారు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. శనివారం వారి కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి తాళం వేవశారు. బాధిత కుటుంబం డయల్‌ 100కు ఫోన్‌చేసి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆలేరు పోలీసులు వచ్చి విడిపించారు. బాధిత కుటుంబం, ఆలేరు సీఐ యాలాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన బిర్రు లక్ష్మీపతి వాటర్‌ ప్లాంట్‌ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొందరు వ్యక్తులు గోవా క్యాసినో జూదం ఆడితే లక్షల్లో సంపాదించవచ్చని లక్ష్మీపతికి ఆశ చూపారు. మల్లేష్‌ అనే వ్యక్తి లక్ష్మీపతితో పాటు మరికొందరిని 30 రోజులకొకసారి గోవాకు తీసుకువెళ్లి క్యాసినో జూదం ఆటను పరిచయం చేశాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా దడిగ రమేష్‌ అనే వ్యక్తి అప్పు రూపంలో లక్ష్మీపతికి ఇస్తూ వచ్చాడు. ఇందుకు గాను రూ.లక్షకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వడ్డీ వేశాడు. గడిచిన ఆరు నెలలుగా రమేష్‌ నుంచి లక్ష్మీపతి సుమారు రూ.13లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఇందుకు లక్ష్మీపతికి చెందిన రెండు వందల గజాల ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. మరికొందరి నుంచి కూడా లక్ష్మీపతి అధిక వడ్డీకి రూ.17లక్షల వరకు అప్పు తీసుకున్నాడు.

ఆరు నెలల్లో రూ.30లక్షలు నష్టం

ఇలా మొత్తం రూ. 30లక్షల మేరకు అప్పులు చేశాడు. మొదట క్యాసినో జూదంలో కాస్తోకూస్తో డబ్బులు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత లక్ష్మీపతి రూ.లక్షల్లో నష్టపోవడంతో రూ.30లక్షల అప్పు మిగిలింది. ఈ విషయం తెలుసున్న అప్పు ఇచ్చినవారు తీసుకున్న అప్పు చెల్లించాలని లక్ష్మీపతిపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. తాకట్టు పెట్టిన ఇంటి స్థలాన్ని తనకు రిజిస్ట్రేషన్‌ చేయాలని రమేష్‌ లక్ష్మీపతిపై ఒత్తిడి పెంచాడు. ఆరు నెలలు గడువు ఇస్తే దశలవారీగా అందరి అప్పు చెల్లిస్తానని లక్ష్మీపతి ప్రాధేయపడినా అప్పు ఇచ్చినవారు వినకుండా వేధించడం మొదలుపెట్టారు. రెండు నెలల కిత్రం లక్ష్మీపతికి చెప్పకుండా అతడి ఇంటి వద్ద ఉన్న ఆటోను సైతం అప్పు ఇచ్చినవారు తీసుకెళ్లారు. శనివారం ఉదయం లక్ష్మీపతితో పాటు అతడి కుటుంబ సభ్యలు ఇంట్లో ఉండగా బయట నుంచి అప్పు ఇచ్చిన రమేష్‌ తాళం వేసి వారిని నిర్బంధించాడు. దీంతో లక్ష్మీపతి డయల్‌ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలేరు పోలీసులు వచ్చి నిర్బంధం నుంచి వారిని విడిపించారు. అనంతరం లక్ష్మీపతి, అతడి భార్య పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని దడిగే రమేష్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి అప్ప ఇచ్చినవారి నుంచి రక్షణ కల్పించాలని, అప్పు తీర్చడానికి ఆరు నెలలు గడువు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ యాలాద్రి పేర్కొన్నారు.

ఫ లక్షల రూపాయలు

నష్టపోయిన బాధితుడు

ఫ అప్పు తీర్చాలంటూ బాధిత కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి తాళం

ఫ డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో వచ్చి విడిపించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement