యాదగిరిగుట్టలో భక్తులకు అన్న ప్రసాదం
యాదగిరిగుట్ట: కార్తీక మాసంలో వచ్చే ప్రతి శని, ఆదివారాల్లో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామని ఇటీవల ఆలయ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం దీక్షపరుల మండపంలో రెండు వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేసి అన్న ప్రసాదాన్ని అందించారు.
నల్లబెల్లం, పటిక పట్టివేత
ఫ నలుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
తిప్పర్తి: అక్రమంగా నల్లబెల్లం, పటిక తరలిస్తున్న వ్యక్తులను తిప్పర్తి శివారులో శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తిప్పర్తి మండల కేంద్రం శివారులో వాహనాలు తనిఖీల్లో భాగంగా పోలీసులు అటుగా వచ్చిన గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 2880 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటికను గుర్తించారు. గూడ్స్ వాహనంలోని గరికమల్ల హిమవత్తు, దూదేకుల ముబారక్, యన్నమల్ల సాయి, మాలవత్ సాయిని అదుపులో తీసుకొని విచారించగా.. ఏపీలోని చిత్తురు నుంచి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ బంగ్లాకు సరఫరా చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నాఉ. పట్టుబడిన నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వి. శంకర్ తెలిపారు.
యాదగిరిగుట్టలో భక్తులకు అన్న ప్రసాదం


