మెగా స్పందన
ఫ ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
ఫ 20,523 మంది అభ్యర్థులు హాజరు
ఫ ఉద్యోగాలకు ఎంపికై న 3,041 మంది
హుజూర్‌నగర్ : డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఉదయం 8 గంటల నుంచే మెగా జాబ్‌మేళా ప్రాంగణానికి అభ్యర్థుల రాక మొదలైంది. వచ్చిన అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా జాబ్‌మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా వచ్చన అనుభవం, గుణపాఠంతో మున్ముందు ఇంతకన్నా మెరుగ్గా జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు.
20వేల మందికిపైగా హాజరు
జాబ్‌మేళాకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 40 వేల మందికిపైగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా 20 వేల మందికిపైగా హాజరయ్యారు. వచ్చిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టోకెన్లు ఇచ్చి వారిని వరుస క్రమంలో కూర్చోబెట్టారు. అ నంతరం విద్యార్హతలను బట్టి వారికి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు.
కంపెనీల వారీగా ఇంటర్వ్యూలు
ఐటీ, ఎడ్యు టెక్నాలజీ, స్కిల్స్ ట్రైనింగ్ విభాగంలో 5,547 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 827 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశా రు. మరో 370 మంది అభ్యర్థుల ఉన్నత అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ రూపొందించారు. అలాగే సర్వీస్ మొబైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 3,850 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 391 మందిని ఎంపికచేసుకున్నారు. 804 మంది అభ్యర్థుల షార్ట్‌లిస్టు రూపొందించారు. మ్యాన్‌ఫ్యాక్చరింగ్, టెక్నికల్ రంగంలో 4,520 మంది హాజ రుకాగా 610 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ విభాగంలో 2,440 మందికి 713 మంది, ఫార్మా హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ విభాగంలో 2,167 మందికి 210 మంది ఎంపికయ్యారు. మరో 195 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును రూపొందించారు. ఆటోమొబైల్స్ రంగంలో 952 మందికి 102 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. 154 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును సిద్ధం చేశారు. లాజిస్టిక్, ఎయిర్ పోర్ట్ రంగంలో 1,047 మందికి 188 మంది ఎంపిక కాగా 10 మంది షార్ట్‌లిస్టును ఆయా కంపెనీల ప్రతినిధులు రూపొందించారు. మొత్తంగా 20,523 మంది ఇంటర్వ్యూలకు రాగ 3,041 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 1,533 మంది అభ్యర్థులతో షార్ట్‌లిస్టును రూపొందించారు.
నేటి జాబ్‌మేళా వాయిదా
ఇతర ప్రదేశాలలో కూడా జాబ్ మేళా నిర్వహించాల్సి ఉన్న కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఆదివారం నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావడం లేదు. ఈ కారణంగా ఆదివారం నిర్వహించే జాబ్‌మేళా వాయిదా వేస్తునట్లు ఆయన తెలిపారు. తిరిగి ఈ జాబ్ మేళాను ఎప్పుడు నిర్వహించేది ఆతేదీని తర్వాత ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
మెగా స్పందన


