వైన్స్‌లకు 27న లక్కీ డ్రా
భువనగిరి: జిల్లాలో మద్యం దుకాణాల కేటా యింపునకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భువనగిరి మండలం రాయగిరి పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలకే ఫంక్షన్‌హాల్‌కు చేరుకోవాలని, కార్యక్రమం సజావుగా సాగేలా సహకరించాలని అధికారులు కోరారు.
కేసుల పరిష్కారానికి చొరవ చూపండి
భువనగిరి: డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు కోరారు. శనివారం భువనగిరిలోని కోర్టులో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ అదా లత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించి కేసులు రాజీపడేలా చూడాలన్నారు. అనంతరం పెండింగ్ కేసులు, సబ్ జైలులో ఖైదీలకు సంబంధించిన కేసుల వివరాలపై వారితో చర్చించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిద, న్యాయ సేవా అధి కార సంస్థ కార్యదర్శి మాదవిలత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, ఏసీపీలు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ నా యు డు, సబ్‌జైలు సూపరింటెండెంట్ నెహ్రూ, పట్టణ సీఐ రమేష్ పాల్గొన్నారు. అదే విధంగా ఫోక్సో చట్టం కింద పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి న్యాయమూర్తి ముక్తిద చర్చించారు. బాధితులకు అందాల్సిన పరిహారం గురించి సమీక్షించారు.
గ్లోస్టర్ నగరంలో
నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట: లండన్‌లోని గ్లోస్టర్ నగరంలో యాదగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణాన్ని ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు స్వామి వారి కల్యాణం ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన నారసింహుడి ఘట్టాలు భక్తులను అలరించాయి. ఈ వేడుకలో ఆలయ ఉప ప్రధానార్చకుడు నర్సింహమూర్తి, అర్చకులు కిరణ్ కుమారాచార్యులు, యూకే తెలుగు అసో సియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మూసీకి 5,015
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. శనివారం ప్రాజెక్టులోకి 5,015 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 4,719 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 244 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు.. కాగా 4.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
వైన్స్‌లకు 27న లక్కీ డ్రా


