పూజితమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది
యాదగిరిగుట్ట: ‘పూజితమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి భోజనం చేస్తున్నావా.. మందులు వేసుకుంటున్నావా? గర్భధారణ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.. పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతాడు’ అని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా శనివారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధి గుండ్లపల్లిలో గర్భిణి పూజిత ఇంటికి కలెక్టర్ వెళ్లారు. పూజితకు న్యూట్రిషన్ కిట్ అందజేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమెకు సూచించారు. కాన్పు అనంతరం 102 వాహనంలో తల్లీబిడ్డను ఇంటి వద్ద చేరుస్తారని పేర్కొన్నారు. సమయానికి భోజనం చేయాలని, డాక్టర్ల సూచన మేరకు మందులు వేసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌ఓ, మెడికల్ ఆఫీసర్, వైద్యసిబ్బంది ఉన్నారు.
ఫ ఆరా తీసిన కలెక్టర్ హనుమంతరావు,న్యూట్రిషన్ కిట్ అందజేత


