గాలికుంటు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
చిట్యాల: తెలంగాణను గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి తెలిపారు. గురువారం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆవులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకా వేయించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ప్రతి యేటా రెండు పర్యాయాలు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో మన పాడి, పశు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వివరించారు. రైతులు విధిగా తమ ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి జీవీ రమేష్, మండల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్, సిబ్బంది శ్రీను, సైదులు, శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకన్న, సునీత, సతీష్ గోపాలమిత్ర సత్యనారాయణ పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ
సంచాలకుడు గోపి


