రోడ్డు నిండా ధాన్యం.. బురదలోకి స్కూల్ వాహనం
తిప్పర్తి : నల్లగొండ పట్టణం నుంచి తిప్పర్తి మండలం దుప్పలపల్లి వరకు ఉన్న అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి సర్వీస్‌రోడ్డులో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. దీంతో వాహనాలు రోడ్డు దిగి వెళ్లాల్సి వస్తోంది. గురువారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రోజు మాదిరిగానే విద్యార్థులను తీసుకెళ్లడానికి దుప్పలపల్లికి వస్తుండగా ధాన్యం రాశులు రోడ్డు కిందకు దిగింది. రోడ్డు కింది భాగం వర్షాలతో బురదమయంగా మారడంతో బస్సు బురదలో కూరుకుపోయి ఒక పక్కకు ఒరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులోకి ఇంకా పిల్లలు ఎక్కలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.


