పాడి పశువుల పెంపకంపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం–రాజేంద్రనగర్, సద్గురు ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గరిడేపల్లి మండలంలో ని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో పాడి రైతులకు పాడి పశువుల యాజ మాన్యంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించినట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్‌చార్జి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వెటర్నరీ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ కిషన్‌కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు పాల ఉత్పిత్తి పెంపుదల, తక్కువ ధరలో దాణా తయారీ, పునరుత్పత్తి, విచక్షణాపూరితంగా ఔషధ వినియోగం గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ డాక్టర్ కిరణ్‌కుమార్ రైతులకు సబ్సిడీలు, ఇతర పథకాల గురించి తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌లోని మామ్నూరు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బిందుమాధురి, మామ్నూరు కేవీకే శాస్త్రవేత్తలు అరుణజ్యోతి, సాయికిరణ్, గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు ఎన్. సుగంధి, సీహెచ్. నరేష్, ఎ. కిరణ్, పి. అక్షిత్, పశువైద్యాధికారిణి జయసుధ, 50మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.


