ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చండూరు: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండల మెండువారిగూడంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండువారిగూడానికి చెందిన నంద్యాల నర్సిరెడ్డి(48) వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది గ్రామాని వెళ్లే దారిలో చండూరు శివారులోని మూతబడిన పాఠశాల సమీపంలో బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. నర్సిరెడ్డి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతకగా మూతబడిన పాఠశాల సమీపంలో మృతిచెంది కనిపించాడు. గురువారం మృతుడి కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.
విద్యుదాఘాతంతో
మేసీ్త్ర మృతి
మునగాల: విద్యుదాఘాతంతో మేసీ్త్ర మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం ముకుందాపురంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన షేక్ పెదబోడయ్య(57) సుతారి మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా గురువారం పెదబోడయ్య పిల్లర్లు ఏర్పాటు చేసే క్రమంలో పిల్లర్లకు ఉండే సువ్వలు పైన ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల వివాహాలు చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
బంగారం అపహరణ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
చివ్వెంల(సూర్యాపేట): బంగారం అపహరణ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. ఆత్మకూరు(ఎస్) మండల కోటినాయక్‌తండాకు చెందిన కోమటిరెడ్డి ఇంట్లో 2005 మార్చి 23న గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బంగారు చైన్, బ్రేస్‌లెట్, చెవి బుట్టలు, రూ.10 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేకు స్థానిక ఎస్‌ఐ బత్తిని శ్రీకాంత్‌గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన తుపాకుల చందు, కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన సున్పపు ధనుంజయ్ చోరీ చేసినట్లు గుర్తించి వారిని రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.హేమలతనాయుడు వాదనలతో ఏకీభవిస్తూ తుపాకుల చందుకు 4 నెలల 23 రోజులు, ధనుంజయ్‌కి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు కానిస్టేబుల్ చైతన్య సహకరించారు.


