ఖర్చు ఎక్కువ అవుతోంది
మంచి ఉద్దేశంతో అదనపు కలెక్టర్ డ్రయ్యర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దానిని వినియోగించాలంటే ప్రత్యేకంగా ట్రాక్టర్ అవసరం ఉంటుంది. సొంత ట్రాక్టర్ లేని రైతులు అద్దెకు తెచ్చుకోవాలి. ట్రాక్టర్‌కు కిరాయితో డీజిల్, డ్రయ్యర్‌కు డీజిల్ ఖర్చు భరించడం రైతులకు సమస్యగా మారుతోంది. 20 నుంచి 30ఎకరాల్లో పంట సాగు చేసే రైతులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం సాధ్యమవుతుంది. సాధారణ రైతులకు సాధ్యమయ్యే పరిస్థితి ఎంతమాత్రం లేదు.
– ఉబ్బు వెంకటయ్య,
వ్యవసాయ మార్కెట్ చైర్మన్, చౌటుప్పల్


