దళారులను నమ్మి మోసపోవద్దు
యాదగిరిగుట్ట రూరల్: రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి ధాన్యం కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం తేమశాతం రాగానే వెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సమస్యను పరిష్కరించాలని ఏఈని ఆదేశించారు.


