హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
సత్ఫలితాలినిస్తున్న
రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్
● బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరిగిన ఓపీ
● అందుబాటులో స్పెషలిస్టు డాక్టర్లు
భువనగిరి: రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ విమర్శించారు. గురువారం భువనగిరిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, అర్హత ఉన్నా రైతుభరోసా అందలేని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా పథకాన్ని వెంటకనే అమలు చేయాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రత్నపురం బలరాం, సురేష్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, కోటేష్, బాలస్వామి, మాణిక్యంరెడ్డి, సురేష్, ఉడుత భాస్కర్, రత్నపురం శ్రీశైలం, సతీష్ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్


