పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
భువనగిరి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఈనెల 31న ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల పోస్టర్‌ను పలు రాజకీయ పార్టీల నాయకులతోకలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పటేల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మహా ఐక్యత పాదయాత్రలు నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని కోరారు. వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల సాంస్కృతి శాఖ అధికారి ధనుంజయనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, పోలేపాక అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు


