
కలెక్టర్ తనిఖీలోనూ వెలుగులోకి..
మందుల కొరతకు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా కారణమని తెలుస్తోంది. కలెక్టర్ హనుమంతరావు ఇటీవల బీబీనగర్ మండలంలోని ఓ పీహెచ్‌సీని తనిఖీ చేశారు. అదే సమయంలో ఓ పేషెంట్ మందుల చీటితో వెనుదిరిగి వెళ్తుండగా కలెక్టర్ కంట పడ్డాడు. అతన్ని కలెక్టర్ ప్రశ్నించగా మందులు లేవు, ప్రైవేట్‌లో తీసుకోవాలని సిబ్బంది తనకు సూచించినట్లు చెప్పాడు. వెంటనే డీఎంహెచ్‌ఓకు ఫోన్ చేయగా మందులు ఉన్నట్లు సమాధానం ఇచ్చాడు. పీహెచ్‌సీలో ఉండగానే తనకు తప్పుడు సమాచారం ఇస్తున్నావని డీఎంహెచ్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేసినా మందుల కొరత ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.