
ఎయిమ్స్ నూతన డైరెక్టర్ నేడు బాధ్యతల స్వీకరణ
బీబీనగర్: ఎయిమ్స్ నూతన డైరెక్టర్ అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో డైరెక్టర్ పని చేసిన వికాస్ భాటియా మే నెలలో ఢిల్లీ ఎయిమ్స్‌కు బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతా శాంతాసింగ్‌ను ఇంచార్జిగా నియమించారు. కాగా పూర్తిస్థాయి డైరెక్టర్‌గా లక్నోలోని సంజయ్‌గాంధీ పోసు్ట్రగాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న అమితా అగర్వాల్‌ను బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నేడు బాధ్యతలు స్వీకరిస్తారని ఎయిమ్స్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యాంక్ గ్యారంటీ,
అగ్రిమెంట్ తప్పనిసరి
సాక్షి,యాదాద్రి : రైస్ మిల్లర్లు అగ్రిమెంట్, బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తన చాంబర్‌లో మిల్లర్లతో సమావేశమైన సీఎంఆర్ డెలివరీ, బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. గత వానాకాలం సీఎంఆర్ 91 శాతం పూర్తయ్యిందని, మిగతాది నిర్దేశిత గడువులోపు అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
25న జాబ్‌మేళా
సాక్షి యాదాద్రి: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈనెల 25వ తేదీన జాబ్‌మేళాఉంటుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. జాబ్‌మేళా నేపథ్యంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. జాబ్‌మేళా ద్వారా తమ కంపెనీల్లో కల్పించను న్న ఉద్యోగ అవకాశాలపై చర్చించారు. జిల్లాలో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తమవంతుగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు రవీందర్, శ్రీదేవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
చిల్లర లేదా.. ఫోన్ పే కొట్టు
ఆత్మకూరు(ఎం): వలిగొండ మండలం వేములకొండకు చెందిన బొల్లు వెంకటయ్య అనే వ్యక్తి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఆత్మకూర్(ఎం)కు వచ్చి యాచిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న టీటైం వద్దకు వెళ్లాడు. చిల్లర లేవని టీటైం నిర్వాహకుడు చెప్పడంతో.. ఫోన్‌పే కొట్టు అంటూ తన సంచిలోనుంచి ఫోన్‌పే క్యూర్‌ఆర్ కోడ్ ప్లేట్ తీశాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

ఎయిమ్స్ నూతన డైరెక్టర్ నేడు బాధ్యతల స్వీకరణ