
పరిశీలించి.. అవగాహన పెంచుకొని
ఎంపీడీఓల పాత్ర కీలకం
బీబీనగర్: గ్రామీణ ప్రాంతాల్లోని స్థితిగతులు, అభివృద్ధి పనులను అధ్యయనం చేయడంతో పాటు పరిపాలనా విధానాలు తెలుసుకునేందుకు 50 మందితో కూడిన ట్రైనీ ఏంపీడీఓల బృందం బుధవారం బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో పర్యటించింది. వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, క్రీడా ప్రాంగణం, నర్సరీలను పరిశీలించింది. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓతో సమావేశం అయ్యారు. పరిపాలన అంశాలపై వారికి ఎంపీఓ అవగాహన కల్పించారు. ఎంపీడీఓల విధుల గురించి డీఆర్‌డీఏ నాగిరెడ్డి, ఏపీడీ సురేష్, ఏంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, టీజీఐఆర్‌డీ ఫ్యాకల్టీ అనిల్‌కుమార్ వారికి వివరించారు. శిక్షణలో భాగంగా అన్నంపట్ల గ్రామంలో పర్యటించా మని, ఈనెల 25తేదీన శిక్షణ ముగుస్తుందని ట్రైనీ ఎంపీడీఓలు తెలిపారు.
ఫ అన్నంపట్లలో పర్యటించిన 50 మంది ట్రైనీ ఎంపీడీఓలు
ఫ అభివృద్ధి పనుల పరిశీలన
భువనగిరిటౌన్ : అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ట్రైనీ ఎంపీడీఓలు బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. తహసీల్దార్, ఎంపీడీఓలు రెండు కళ్లలాంటి వారని.. సేవా దృక్పథంతో పని చేయాలని వారికి సూచించారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.