
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల్లేవ్
సాక్షి, యాదాద్రి: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలను మందుల కొరత పీడిస్తోంది. సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదు. మందుల కొరత వల్ల రోగులు ఆస్పత్రులకు వచ్చి వట్టి చేతులతో తిరిగిపోతున్నారు. జ్వరానికి వాడే పారాసిటమాల్, జలుబు, దగ్గుకు వాడే మందులు సైతం ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తుందని రోగులు చెబుతున్నారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సాక్షి విజిట్ చేయగా వాస్తవాలు వెలుగుచూశాయి.
జ్వరం, జలుబు, దగ్గు ట్యాబ్లెట్లకూ కటకట
● మోటకొండూరు పీహెచ్‌సీలో ఆరు నెలలుగా ఐడ్రాప్స్ కొరత ఉంది.
● బొమ్మలరామారం పీహెచ్‌సీలో పారాసెట్‌మల్, ఎంబ్రాసిల్, మెట్రోజిన్, సిట్రోజెన్, అల్బెండజోల్ సిరప్‌లు, హైడ్రోజన్ ఫెరాకై ్సడ్, అమాక్సలిన్ మాత్రలు లేవు. ఇక్కడ బ్యాండేజీకి సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
● తుర్కపల్లి మండలంలోని మాదాపూర్‌లో కుక్కల దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. కుక్కలు, కోతుల దాడిలో గాయపడి ఈ పీహెచ్‌సీకి రోజూ ఐదారుగురు బాధితులు వస్తున్నారు. వారం రోజులుగా వ్యాక్సిన్ లేదు. గత్యంతరం లేక బాధితులు భువనగిరి, హైదరాబాద్, జనగామకు వెళ్తున్నారు.
● సంస్థాన్ నారాయణపురం పీహెచ్‌సీలో దగ్గు మందు కొరత ఉండి. వారం క్రితం ప్రతిపాదనలు పంపించామని అధికారులు చెబుతున్నా ఇంత వరకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య ఉంది.
గడువుతీరిన మందులు
పీహెచ్‌సీల్లో అయిపోయిన మందుల జాబితాను ఫార్మాసిస్టులు నల్లగొండలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్(సీడీఎస్)కు పంపిస్తే రెండుమూడు రోజుల్లో వస్తాయి. కానీ, రోజుల తరబడి జాబితా పంపడం లేదని తెలిసింది. మరోవైపు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి గడువుతీరిన మందులు పంపుతున్నారు. ఇటీవల తుర్కపల్లి, దండుమల్కాపురం పీహెచ్‌సీల్లో రోగులకు గడువుతీరిన మందులు పంపిణీ చేయడం వెలుగుచూసింది.
ఫ సాధారణ జబ్బులకూ మాత్రలు ఇవ్వలేని దైన్యం
ఫ చాలా వరకు బయటకు రాస్తున్న వైద్యులు
ఫ కుక్క కరిచినా భువనగిరి, హైదరాబాద్, జనగామ పోవాల్సిందే
ఫ కొన్ని చోట్ల గడువుతీరిన మందులతో సరిపెడుతున్న సిబ్బంది
ఫ తమ కష్టాలు తీర్చాలంటున్న ప్రజలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల్లేవ్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల్లేవ్