
ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ అధికారి
నల్లగొండ: టపాకాయల దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం అధికారి సత్యనారాయణరెడ్డి గురువారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా టపాకాయల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు గాను అనుమతి కోసం నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి సత్యనారాయణరెడ్డిని ఓ వ్యాపారి సంప్రదించాడు. ఎన్‌ఓసీ మొత్తం తానే చేసి ఇస్తానని ఇవ్వాలని సదరు వ్యాపారిని సత్యనారాయణరెడ్డి రూ.10వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.8వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో సదరు వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌లో వ్యాపారి నుంచి సత్యనారాయణరెడ్డి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా నల్ల గొండ రేంజ్ యూనిట్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారించి నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1084 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
టపాకాయల దుకాణం ఏర్పాటుకు
ఎన్‌ఓసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్