
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
మిర్యాలగూడ అర్బన్: వ్యభిచార గృహంపై శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ వన్‌టౌన్ ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న రమావత్ విజయ, ఆమె కుమారుడు రమావత్ వినోద్‌రాథోడ్ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి మహిళను, విటుడిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఒక యాక్టీవా వాహనం, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.