
బ్రిడ్జి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
బ్రిడ్జి పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తుర్కపల్లి, మల్లాపురం వెళ్లే వాహనదారులు వాసవీసత్రం నుంచి తులసీ కాటేజ్ మీదుగా రెడ్డి సత్రం వద్ద తుర్కపల్లి మెయిన్ రోడ్డుకు కలవనున్నారు. తుర్కపల్లి, మల్లాపురం నుంచి యాదగిరిగుట్టకు వచ్చే వాహనాలు రింగ్ రోడ్టులోని యాదవఋషి సర్కిల్ నుంచి గరుడ సర్కిల్ మీదుగా వైకుంఠ్వారం వైపునకు మళ్లిస్తున్నారు. స్కూల్ బస్సులు, లారీలు, ఆర్టీసీ బస్సులు తదితర భారీ వాహనాలను వైకుంఠద్వారం నుంచి యాదవ్ రుషి సర్కిల్ వరకు అనుమతించడం లేదు. వాటిని వైకుంఠద్వారం నుంచి గరుడ సర్కిల్ మీదుగా యాదవ ఋషి సర్కిల్ మార్గంలో మల్లాపురం, తుర్కపల్లి వెళ్లేందుకు వీలు కల్పించారు.