
చేపట్టాల్సిన పనులు ఇవీ..
ప్రస్తుతం బ్రిడ్జి 64 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు పనులు పూర్తి చేయాల్సి ఉంది. బ్రిడ్జి సమీపంలోనే స్టీరింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. లండన్ నుంచి వచ్చిన కేబుల్స్‌ను బిగించి, ఆ తరువాత క్రేన్ సహాయంతో బ్రిడ్జికి అనుసంధానం చేస్తారు. ఆ తరువాత స్లాబ్ పనులు చేపడతారు. ఈ పనులు పూర్తయ్యేందుకు నాలుగు నెలలకు పైగానే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నెట్‌వర్క్ ఆర్చ్ బ్రిడ్జి పనులు అందుబాటులోకి వస్తే కొండపైకి వాహనాలు వెళ్లేందుకు, దిగేందుకు మార్గం సులువ కానుంది. రూ.4.2 కోట్ల నిధులతో పనులు నిర్వహిస్తున్నారు.