
ఇక ‘స్థానిక’ సమరమే..!
సాక్షి యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో తేదీ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల ముసాయి, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను ఈనెల 6న ప్రచురించనున్నారు. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అదే రోజు కలెక్టర్ అధ్యక్షతన ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాలపై చర్చించనున్నారు. 10వ తేదీన తుది జాబితా వెల్లడించనున్నారు. జిల్లాలో 178 ఎంపీటీసీ, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదం పొందడంతో రాజకీయ పార్టీలు సైతం ఎన్నికలపై దృష్టి సారించాయి. ఆశావహులు రిజర్వేష్ల కోసం ఎదురుచూస్తున్నారు.