రైల్వే ప్రాజెక్టులు | - | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రాజెక్టులు

Jul 22 2025 6:18 AM | Updated on Jul 22 2025 9:23 AM

రైల్వే ప్రాజెక్టులు

రైల్వే ప్రాజెక్టులు

ఇప్పటికే ఎంఎంటీఎస్‌, తాజాగా రీజినల్‌ రింగ్‌ రైల్‌

కొత్తగా

రెండు

సాక్షి, యాదాద్రి : జిల్లా మీదుగా కొత్తగా మరో రైల్వే లైన్‌ రానుంది. ఇప్పటికే ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపునకు కేంద్రం అనుమతి ఇవ్వగా.. తాజాగా రీజినల్‌ రింగ్‌ రైల్‌ను ప్రతిపాదించింది. ఈ రెండు రైల్వే లైన్ల ద్వారా జిల్లాకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని పలువురు అభిప్రాయపడుతుండగా.. రైతుల్లో మాత్రం భూ సేకరణ గుబులు నెలకొంది.

మూడు రకాల ప్రతిపాదనలు

రీజినల్‌ రింగ్‌ రైల్వే లైన్‌ వల్ల జిల్లాలోని పలు ప్రాంతాలకు– హైదారాబాద్‌ మధ్యన మల్టిమోడల్‌ కనెక్టివిటీ పెరగనుందని, పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సత్వర రవాణా సౌకర్యం తదితర ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. నూతన రైల్వేస్టేషన్ల నిర్మాణం వల్ల వాణిజ్య, వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందుంతుందని భావించింది. ఇందుకోసం తొలుత రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్యనుంచి 8 మీటర్ల వైశాల్యంలో రింగ్‌ రైల్వే లైన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీని వల్ల భూసేకరణ సమస్య తప్పనుందని, రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం సేకరించే భూములతోనే సరిపెట్టవచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో పాటు రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం మండలాల మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి సైతం ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఏది ఫైనల్‌ కానుందో తెలియాల్సి ఉంది.

3 నుంచి 11 కి.మీ దూరం

తాజా ప్రతిపాదన ప్రకారం రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఆవల 3నుంచి 11 కిలో మీటర్ల దూరం వరకు రింగ్‌ రేల్వై లైన్‌ అలైన్‌మెంట్‌ మారింది. యాదగిరిగుట్ట, వంగపల్లి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల పరిధి నుంచి ప్రతిపాదించారు. గెజిట్‌ రానప్పటికీ రైల్వే లైన్‌ ఎక్కడి నుంచి పోనుందోనన్న ఆయా ప్రాంతాల ప్రజల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్‌ కాలాలో రైతులు రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం భూములు ఇచ్చారు. కొత్తగా చేసిన ప్రతిపాదనతో ఆయా ప్రాంతాల్లో భూములున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఫ రింగ్‌ రైల్వే లైన్‌కు వేర్వేరు ప్రాంతాల నుంచి మూడు ప్రతిపాదనలు

ఫ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఆవల నుంచి ప్రతిపాదన తెరపైకి

ఫ ఏ గ్రామాల మీదుగా పోనుందోనని చర్చ

ఫ భూములున్న రైతుల్లో గుబులు

ఎంఎంటీఎస్‌ భూ సేకరణ సర్వే పూర్తి

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.412 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌ వెంట మరో ట్రాక్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఘట్కేసర్‌ నుంచి బీబీనగర్‌, భువనగిరి మండలాలు, రాయగిరి మీదుగా వంగపల్లి వరకు 39 కిలో మీటర్ల భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సర్వే పూర్తయ్యింది. రైల్వే శాఖ భూములు ఉన్నచోట సమస్య లేకపోగా, కొన్ని చోట్ల ప్రైవేట్‌ భూములను సేకరించాల్సి ఉంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మూడు, నాలుగో రైల్వే లైన్ల కోసం భూ సేకరణకు రైల్వే అధికారులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రెవెన్యూ అఽధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. భూ సేకరణకు త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్‌ రానుంది. దీంతో ఈ ప్రాంత రైతుల్లో ఆందోళన మొదలైంది. పగిడిపల్లి వద్ద గల నడికుడి, ఖాజీపేట ట్రాక్‌లను ఎలాంటి ఆటంకం లేకుండా దాటడానికి ఇక్కడ మెట్రో రైల్‌ మాదిరిగా ఎత్తయిన బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇందుకోసం ఇక్కడ అదనపు భూ సేకరణ చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement