
సీఎం ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి
సాక్షి,యాదాద్రి : వర్షాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలపై వారితో చర్చించారు. అనంతరం జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో కలెక్టర్ హనుమంతరావు రివ్యూ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువుల్లో నీటి నిల్వల సమాచారాన్ని రోజువారీగా తెలియజేయాలన్నారు. లబ్ధిదారులందరికీ రేషన్‌కార్డులు పంపిణీ చేయాలని, ప్రక్రియ ముగిసిన తరువాత వివరాలు సమర్పించాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలకు నియమించిన అధికారుల వివరాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, సివిల్ సప్లై అధికారి రోజారాణి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు