
నేడు శైలజారామయ్యర్ రాక
భువనగిరిటౌన్ : చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ మంగళవారం చౌటుప్పల్‌కు రానున్నారు. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పద్మవంశీ ఫంక్షన్ హాల్‌లో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసే సదస్సులో ఆమె పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద ప్రవేశపెట్టిన చేనేత పథకాలు, అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
కేజీబీవీలో తనిఖీ
భువనగిరి: జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నరా, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటుందా, ఉపాధ్యాయుల కొరత ఏమైనా ఉందా.. అని తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని మంచిగా చదువుకోవాలని పేర్కొన్నారు.
మహా శివుడికి బిల్వార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటికలింగానికి పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు
దరఖాస్తు చేసుకోవాలి
ఆలేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ జయరాజారామ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లిష్, తెలుగు,ౖ డెయిరీ సైన్స్ సబ్జెక్టులకు గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీజీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50శాతం, ఇతరులు 55శాతం మార్కులు ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం 3గంటల వరకు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని ప్రిన్సిపాల్ కోరారు.
కొండగడప
విద్యార్థినికి సన్మానం
మోత్కూరు: మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని దొండ స్వాతి ప్రముఖ సాహితీవేత్తల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వాతి చదువుతో పాటు విద్యార్థి దశనుంచే రచనలు, వ్యాసాలు రాస్తూ పేరుగడించారు. ఆమె రాసిన వ్యాసం చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ సూర్య ధనుంజయ్, ప్రసిద్ధ సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్, నలిమిల భాస్కర్, ఆట్టం దత్తయ్య వ్యాసాల సరసన చోటు దక్కడంతో ఆమెకు సత్కరించారు.ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ పటేల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు స్వాతిని శాలువాతో సన్మానించి అభినందించారు.
పురస్కారం అందుకోవాలని చేనేత కార్మికులకు ఆహ్వానం
సంస్థాన్ నారాయణపురం: జాతీయ చేనేత అవార్డులకు ఎంపికై న చేనేత కళాకారులు పురస్కారం అందుకోవాలని చేనేత, జౌళి కేంద్ర మంత్రిత్వ శాఖ సోమవారం ఆహ్వానం పంపింది. యువ చేనేత విభాగంలో గూడ పవన్, మా ర్కెటింగ్ విభాగంలో గజం నర్మద అవార్డులకు ఎంపికయ్యారు. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో రా ష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు. అవార్డుకు ఎంపికైన ఇద్దరూ సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రా మానికి చెందిన కళాకారులు కావడం విశేషం.

నేడు శైలజారామయ్యర్ రాక