
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి
సూర్యాపేట : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు లీగల్ సెల్ కృషి చేస్తుందని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీసీసీ లీగల్ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అహర్నిశలు పాటుపడుతోందన్నారు. సమాజానికి అండగా ఉంటూ హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉమాశంకర్, రాష్ట్ర సెక్రటరీ మూమిన్ రోషన్, రాష్ట్ర కన్వీనర్ నిమ్మరబోయిన నవీన్, ఏ ఎల్‌యూ జిల్లా సెక్రటరీ సీనపల్లి సోమేశ్వర్, మారపాక వెంకన్న, షఫీ ఉల్లా, బత్తిని వెంకటేశ్వర్లు, ఈశ్వర్ కుమార్, టేకులపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.