ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్‌

Jul 16 2025 4:17 AM | Updated on Jul 16 2025 4:19 AM

నిందితుల అరెస్ట్‌

గుంటి సాయికుమార్‌, స్వాతి, పొట్టెపాక మహేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాంక్ష్‌యాదవ్‌ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు, బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, అడిషనల్‌ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్‌ సీఐ శంకర్‌గౌడ్‌, మోటకొండూర్‌ ఎస్‌ఐ ఉపేందర్‌యాదవ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాంక్ష్‌యాదవ్‌ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు.

అసలు జరిగింది ఇదీ..

ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్‌ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్‌ షోరూంలో మేనేజర్‌గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎస్‌ఎన్‌ మోటార్స్‌లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్‌ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్‌ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్‌తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్‌ఎన్‌ మోటార్స్‌ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్‌ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు.

గొడవలు ఇలా..

స్వాతి సోదరుడు మహేశ్‌కు ఇద్దరు భార్యలు. మహేష్‌ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్‌కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్‌ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్‌కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్‌కు వివరించింది. సాయికుమార్‌ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్‌ వివాహేతర సంబంధానికి మహేష్‌ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్‌ నిర్ణయించుకున్నారు.

వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు

స్వామిని హత్య చేయడానికి సాయికుమార్‌, స్వాతి, మహేష్‌ ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్‌ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్‌ డిలీట్‌ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్‌ నంబర్‌ను కూడా సెల్‌ఫోన్‌లో ఫీడ్‌ చేసుకోలేదు.

కారు అద్దెకు తీసుకుని..

ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్‌, మహేష్‌కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్‌.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్‌ డ్రైవింగ్‌ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్‌పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్‌ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్‌ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్‌పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్‌ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్‌ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్‌ అమలు చేస్తున్న సమయంలో మహేష్‌, స్వాతి, సాయికుమార్‌ వాట్సాప్‌ గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుకున్నారు. వాట్సాప్‌ కాల్‌లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్‌ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్‌ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్‌, రామలింగస్వామిని బైక్‌పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్‌ వద్ద వదిలేశాడు.

ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది

ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్‌లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్‌ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.

ఫ వేధిస్తున్న భర్తను సోదరుడు,

ప్రియుడితో కలిసి కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన భార్య

ఫ రోడ్డు ప్రమాదంగా

చిత్రీకరించేందుకు ప్రయత్నం

ఫ ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. పరారీలో మరొకరు

ఫ వివరాలు వెల్లడించిన భువనగిరి డీసీపీ ఆకాంక్ష్‌యాదవ్‌

కారుతో.. కదిలిన డొంక

రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్‌ ఎస్‌ఐ ఉపేందర్‌యాదవ్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్‌ ఆధారంగా కారు యజమానికి ఫోన్‌ చేసి విచారించగా.. సాయికుమార్‌ సెల్ప్‌ డ్రైవింగ్‌ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్‌ సెల్‌ఫోన్‌ చెక్‌ చేయగా స్వాతి నంబర్‌ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement