
విపత్తు పరిస్థితులపై ఎయిమ్స్‌లో శిక్షణ
బీబీనగర్: విపత్తు పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేలా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ విభాగం ద్వారా బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలకు అందజేసిన భారత్ హెల్త్ ఇనిషియేటివ్, సహయోగ్ హిత మైత్రి క్యూబ్‌ల వినియోగంపై మంగళవారం 100మందికి శిక్షణ ఇచ్చారు. కేంద్ర విపత్తు నిర్వహణ సెల్ నుంచి రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ డాక్టర్ తన్మోయ్ రాయ్, బృందం క్యూబ్‌ల వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంగీత సంపత్, అభిషేక్ ఆరోరా, అగ్నిమాపక అధికారి మధుసూదన్‌రావు, భీష్మ్ క్యూబ్స్ నోడల్ అధికారి మహేశ్వర్ లక్కిరెడ్డి, అదనపు నోడల్ అధికారి సిద్దార్థరావు పాల్గొన్నారు.