
విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్ల గొండలోని ఎంజీయూ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఎమ్మెస్సీ విద్యార్థుల పరిశోధన పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చివరి సెమిస్టర్‌లో విద్యార్థులు చేసిన పరిశోధనలు తమ ఉద్యోగ అవకాశాలను నిర్ణయిస్తాయని గుర్తించాలన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆహార భద్రత విభాగం బాధ్యులు ఎం. సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. ఆహార పదార్థాల్లో ఫంగస్ ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. తినే ఆహార పదార్థాల్లో నాణ్యత, శుభ్రత పాటించాలన్నారు. అనంతరం 21మంది విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. 13మంది విద్యార్థులు తమ పరిశోధనలకు సంబంధించి పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, తిరుమల, అన్నపూర్ణ, మాధురి, మద్దిలేటి, రూప పాల్గొన్నారు.
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్