
ఉరేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని బృందావన్ వెంచర్ వద్ద రోడ్డు పక్కన చెట్టుకు సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45ఏళ్లు ఉండవచ్చని, అతడి చేతికి కంకణం, ఒంటిపై జంజం, మెడలో తాయత్తు ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 6309680086, 8712670186 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మనస్తాపంతో బలవన్మరణం
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన బిర్రు శ్రీనివాస్(67) సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ భార్య పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి శ్రీనివాస్ పక్షవాతానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరి వివాహాలు అయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విధుల్లో చేరిన వారం రోజుల్లోనే..
● పవర్‌ప్లాంట్ నీటిలో మునిగి వ్యక్తి మృతి
మఠంపల్లి: తాత్కాలిక ఉద్యోగిగా పవర్ ప్లాంట్‌లో విధుల్లో చేరిన వారం రోజుల్లోనే నీటిలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. మఠంపల్లి మండలం యాతవాకిల్ల వద్ద గల వేములూరు రిజర్వాయర్‌పై నిర్మించిన పవర్ ప్లాంట్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న నేరేడుచర్ల మండలం పీర్లగూడేనికి చెందిన షేక్ ఉస్మాన్ (35) సోమవారం పవర్ ప్లాంట్ గేట్లకు మర్మతులు చేస్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న హుజూర్‌నగర్ సీఐ గజ్జె చరమందరాజు, ఎస్‌ఐ పి. బాబు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఉరేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య