పశుగ్రాసం సాగులో మెళకువలు | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాసం సాగులో మెళకువలు

Jun 10 2025 3:12 AM | Updated on Jun 10 2025 3:12 AM

పశుగ్

పశుగ్రాసం సాగులో మెళకువలు

పెద్దవూర: పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటి సాగుకు ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే శాసీ్త్రయ పద్ధతిలో పశుగ్రాసం సాగు చేస్తే ఖర్చు తగ్గించవచ్చని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్‌ నులక నాగార్జున్‌రెడ్డి చెబుతున్నారు. డెయిరీ ఫాంల నిర్వహణ వ్యయంలో 70శాతం వరకు పశువుల మేతకే సరిపోతుందని, మేత ఖర్చును తగ్గిస్తే లాభాలు పెంచుకునే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. పాలశీతలీకరణ అధికారులు పాలు సప్లై చేసే రైతులకు 50 శాతం సబ్సిడీపై, అదేవిధంగా పశుసంవర్ధకశాఖ అధికారులు సైతం 50శాతం రాయితీపై పాడి రైతులకు విత్తనాలు ఇస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం సాగు చేస్తే గడ్డి కొరత తీరుతుందని ఆయన సూచిస్తున్నారు.

పశుగ్రాసం సాగు చేసే విధానం

● పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్‌ నైపర్‌, కో1, కో 2, ఎస్‌ఎస్‌జీ–825 రకాలు.

● 85శాతం పచ్చిమేతను ఈ రకాల ద్వారా తీర్చుకోవచ్చు.

● ఒకసారి నాటితే 4 నుంచి 5 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు.

● జనవరి నుంచి ఆగస్టు నెల వరకు విత్తనాలు విత్తుకోవచ్చు.

● అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆమ్ల గుణాలు గల నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది.

● పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.

● ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు.

● దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి.

● విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 22 కిలోల యూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది.

● అధిక విస్తీర్ణంలో సాగు చేసి సైలే జీ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వ చేసి వాడుకోవచ్చు.

పాల దిగుబడి ఎక్కువే..

పశుగ్రాసం సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరం అవుతుంది. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చి మేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చి మేత వలన పాల దిగుబడులు 25 శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చి మేత ద్వారా 5 నుంచి 6లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చు. పచ్చి మేతలో కాల్షియం, భాస్వరం వంటి మాంసకత్తులతో పాటు ఏ, డీ, ఈ విటమిన్లు, పిండి, కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. నీరు తక్కువగా ఉన్న పాంతాల్లోనూ పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు.

పశుగ్రాసం సాగులో మెళకువలు1
1/1

పశుగ్రాసం సాగులో మెళకువలు

Advertisement
 
Advertisement
Advertisement