గురితప్పని లక్ష ్యం
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన దేప విప్లవరెడ్డి, రాజ్యం దంపతుల కుమారుడు కాంత్రికుమార్ భారత ఆర్చరీ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. చిన్నప్పడే క్రాంతికుమార్‌లోని ప్రతిభను గుర్తించిన అతడి తల్లిదండ్రులు 4వ తరగతిలోనే హైదారాబాద్‌లోని హకీంపేటలో గల తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలలో చేర్పించారు. అక్కడ పనిచేస్తున్న ఆర్చరీ కోచ్ డాక్టర్ రవిశేఖర్ ప్రోత్సాహంతో క్రాంతికుమార్ ఆర్చరీ క్రీడలో పట్టు సాధించారు. అక్కడే బీఏ పూర్తిచేసి, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత కలకత్తాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఆర్చరీ కోచ్‌గా డిప్లొ మా పూర్తిచేశారు. 2024లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆర్చరీ కోచ్‌గా ఉద్యోగం రావడంతో హర్యానాలోని సోనిపట్ల ప్రాంతంలో కోచ్‌గా ఉద్యోగంలో చేరారు. ఇటీవల మహరాష్ట్రలో నిర్వహించిన జాతీయ ఆర్చరీ జట్టు కోచ్ ఎంపికలో పాల్గొని ఈ నెల 15 నుంచి 20 వరకు సింగపూర్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత ఆర్చరీ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. క్రాంతికుమార్‌కు ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి అరవింద్, కోశాధికారి సత్యప్రసాద్, నల్ల గొండ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తునిక విజయసాగర్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కామినేని, మాజీ ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవరెడ్డి, కోశాధికారి పుట్ట శంకరయ్య అభినందనలు తెలిపారు.
భారత ఆర్చరీ జట్టు కోచ్‌గా
పుట్టపాక వాసి క్రాంతికుమార్
చిన్నప్పుడే అతడిలోని ప్రతిభను
గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు
నిరంతరం ప్రోత్సహించారు
నాలోని ప్రతిభను చిన్పప్పుడే నా తల్లింద్రడులు గుర్తించి స్పోర్ట్స్ పాఠశాలలో చేర్పించారు. నా గురువు డాక్టర్ రవిశేఖర్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. రవిశేఖర్ సార్, నా తల్లిందండ్రుల ప్రోత్సాహమే నేను జాతీయ జట్టు కోచ్‌గా ఎంపికవ్వడానికి దోహదపడింది. భారత్ జట్టు విజయం సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతా.
– దేప క్రాంతికుమార్


