గాంధీ పేరంటే ఎందుకంత వణుకు
భువనగిరిటౌన్ : గాంధీ పేరు వింటేనే బీజేపీ నేతలకు వణుకు పుడుతుందని డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఐలయ్య అన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం పేరు తొలగించడాన్ని నిరిసిస్తూ ఆదివారం భువనగిరిలోని గాంధీపార్కు ఎదుట చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పేర్లను ఎక్కడా వినిపించకుండా, కనిపించకుండా బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తుందని, అందులో భాగంగా ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పథకాల్లో గాంధీ పేరును తొలగిస్తారేమోగానీ, ప్రజల హృదయాల్లో మహాత్మాగాంధీ ఎప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. నాటి యూపీ సర్కార్ మహాత్మీగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం తేగా.. మోదీ సర్కార్ పథకానికి తూట్లు పొడుస్తుందన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్‌జీగా మార్చడం దారుణమన్నారు. బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు గాంధీ విగ్రాహానికి పూలమలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బుడిగే పెంటయ్య, బెండె లాల్‌రాజు, బట్టు రామచంద్రయ్య, షరీఫ్, రాచమల్ల రమేష్, కృష్ణారెడ్డి, బెండె శ్రీకాంత్, లయీఖ్‌అహ్మద్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ ప్రయోజనం కోసమే పేర్ల మార్పు
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


