రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ఆలేరు: ఆలేరు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 72వ పురుషుల జిల్లా కబడ్డీ సెలక్షన్స్ పూర్తయ్యాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి క్రీడాకారుల పాల్గొన్నారు. వివిధ రౌండ్లలో ప్రతిభను కనబరిచిన 14 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య తె లిపారు. క్రీడాకారులకు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర మహేందర్ యాదవ్ జెర్సీలు అందజేశారు. మాజీ క్రికెటర్ ఖాదర్‌భాషా, గాయకుడు సిమ్మి సిద్ధులు,రెఫరీ మరాఠీ లింగస్వామి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ పూల చంద్రకుమార్,ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


