జగన్ అంటే ప్రజలకు ఒక భరోసా
యాదగిరిగుట్ట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటకు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో.. అదే విధంగా ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో టీటీడీ లోకల్ అడ్వైజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పేద మహిళలకు 1,000 చీరలు, మున్సిపల్ సిబ్బందికి దుప్పట్లు, విద్యార్థులకు నోట్ బుక్స్, పేదలకు 10 మందికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి పేరుతో చంద్రబాబు నాయుడు అరాచక పాలన చేస్తున్నారని ఆరోపించారు. జన సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముందుకు సాగారన్నారు. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చాలా మార్పులు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అభిమానులు వెంకట్‌రెడ్డి, రాజారెడ్డి, నందనం రాము, జీవన్‌గౌడ్, రాజాశేఖర్‌రెడ్డి, చింతకింది కృష్ణ, వడ్లోజు ఉమేష్, వడ్లోజు శ్రీధర్, కల్వకొలను సతీష్ రాజ్, ఎంఎం కృష్ణ, చుక్కల ఉపేందర్, పల్లెర్ల గోపి, పద్మనాభ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల
యాదగిరిగుట్టలో ఘనంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పుట్టిన రోజు వేడుకలు


