ఆత్మకూరు(ఎం): భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం, రహీంఖాన్‌పేటలో ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. సందర్భంగా రాఘవాపురంలో నాలుగు, రహీంఖాన్‌పేటలో 31 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. సమావేశంలో ఆత్మకూరు(ఎం) తహసీల్దార్ లావణ్య, వలిగొండ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డీటీ ఎండీ షఫీయోద్దీన్, ఆర్‌ఐలు మల్లిఖార్జునరావు, పాండు, సర్వేయర్ స్వప్న, సిబ్బంది నవనీత, సంజయ్, వనం రమేష్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి
వలిగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శోభారాణి అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి మండల స్థాయి అధికారులు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలోని నాతాళ్లగూడెంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం అదే గ్రామంలోని నర్సరీ, రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ పరిశీలించారు. అక్కంపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆమె వెంట ఎంపీడీఓ జితేందర్ రెడ్డి, ఏపీఎం జాని, ఎంపీఓ కేదారేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయం సిబ్బంది తదితరులున్నారు.
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
సంస్థాన్ నారాయణపురం: వేసవి తరగతులకు హాజరై చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేక అధికారి భీంసింగ్ అన్నారు. సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. దూర ప్రాంతం విద్యార్థులకు బస్సు, హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ మాతేశ్వరి, అధ్యాపకులు ముత్యాలు, జనార్దన్, రమేష్, నర్సింహ, లక్ష్మీనర్సింహ, మాధవి, శారద, మహేశ్వరి, జూవేద్ తదితరులున్నారు.
లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి
భువనగిరిటౌన్ : రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు లింకేజ్ ప్రక్రియలను సమీక్షించేందుకు వివిధ మండలాల్లోని బ్యాంక్ మేనేజర్లతో మంగళవారం భువనగిరిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పథకం జిల్లా సమన్వయకర్త నాగిరెడ్డి పథకం మార్గదర్శకాలను వివరించారు. మే 10 నాటికి తాత్కాలిక లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. బ్యాంకులకు పంపిన జాబితాలను పరిశీలన చేసి, దినసరి పరిశీలన పురోగతిని ఎంపీడీఓల ద్వారా ప్రధాన కార్యాలయానికి అందించాలన్నారు. సమావేశంలో భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, పోచంపల్లి, తుర్కపల్లి, ఆలేరు, మోటకొండూర్, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, బీసీ, మైనారిటీ సంక్షేమ జిల్లా అధికారి యాదయ్య పాల్గొన్నారు.

రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి