
అధిక కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కోర్టులోని ఆయన చాంబర్‌లో జాతీయ లోక్ అదాలత్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని న్యాయమూర్తులు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. జూన్ 14న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి దాదాపు 3228 రాజీ పడదగు అన్ని క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. అత్యధిక కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, ఏపీపీఓలు సౌజన్య, పద్మజ, చంద్రశేఖర్, అవినాష్, పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్స్, కోర్టు కానిస్టేబు ల్స్ పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ అధ్యక్షుడు జయరాజు