
ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య
హుజూర్‌నగర్: ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్మ చేసుకుంది. ఈ ఘటన హుజూర్‌నగర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ పట్ట ణానికి చెందిన షేక్ ఖాసింబీ తన కుమార్తె షేక్ మహబూబీ అలియాస్ హసీనా(19)ని గత నెల 30వ తేదీన చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసుఫ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కాగా హసీనా తన భర్త యూసుఫ్‌తో కలిసి శనివారం తన తల్లిగారింటికి వచ్చింది. ఆదివారం ఉదయం బాత్‌రూంలో స్నానం చేయడానికి వెళ్లిన హసీనా అందులో ఉన్న ఇనుప కడ్డీకి ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. హసీనా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాలకృష్ణ
నాగారం : వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలకృష్ణ ఎంపికయ్యారు. ఆదివారం తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆలకుంట్ల ఉపేంద్ర, జనరల్ సెక్రటరీ రూపానిరాజు, సోషల్ మీడియా ఇన్‌చార్జి శివరాత్రి గోపి, కార్యదర్శి బండారి రాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల రమేష్‌చంద్ర, ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల మల్ల య్య, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య