
● రయ్.. రయ్.. తాటి పయ్యల బండి
తాటి పయ్యల బండి.. బహుశా పట్టణాల్లో పుట్టి పెరిగిన వారికి ఈ బండి గురించి
తెలియకపోవచ్చు. కానీ.. గ్రామాల్లోని పిల్లలకు వేసవి సెలవుల్లో తాటిముంజలు తిన్న తర్వాత వాటితో తాతలు బండి తయారుచేసి ఇస్తే
రోజంతా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉంటారు. యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామంలో శనివారం ఇద్దరు పిల్లలు
తాటి పయ్యల బండితో ఆడుకుంటూ
కనిపించారు. వీరిని చూసిన కొందరు
‘ఆ రోజులు.. మళ్లీ రావు’ అంటూ తమ
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
– యాదగిరిగుట్ట రూరల్