సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం

Apr 29 2025 10:05 AM | Updated on Apr 29 2025 10:05 AM

సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం

సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం

రామన్నపేట, శాలిగౌరారం: కాలువల ఆధునీకరణ, మరమ్మతులు చేయడం ద్వారా సాగునీటి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ శివారులో మూసీ నదిపై గల శాలిగౌరారం ప్రాజెక్టు కాలువ హెడ్‌ రెగ్యూలేటరీని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న కత్వ, హెడ్‌ రెగ్యులేటరీ గేట్లను, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల వెంట శాలిగౌరారం ప్రాజెక్టు కాలువను పరిశీలించారు. మూసీలో హెడ్‌ రెగ్యులేటరీకి అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుడెక్కను నిరంతరాయంగా తొలగించుటకు, దెబ్బతిన్న కత్వ మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెగ్యులేటరీ తలుపులను ఆపరేట్‌ చేయడానికి వారం రోజుల వ్యవధిలో గేర్‌ బాక్స్‌లను బిగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. 27కి.మీ. పొడవైన కాలువలో ఇప్పటి వరకు 14కి.మీ. వరకే షీల్ట్‌ను తీశారని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి మంజూరైన నిధులు, జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌పై ఎంపీ, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. హెడ్‌రెగ్యూలేటర్‌ షట్టర్లు బిగించడం, రాచకాల్వలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనులను పదిరోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. పనులు పూర్తిచేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్‌ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుర్కపల్లి దగ్గర రాచకాల్వపై ఉన్న షట్టర్లను, శాలిగౌరారం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. వారి వెంట తిరుమలగిరి నీటిపారుదలశాఖ ఈఈ జె. సత్యనారాయణ, డీఈఈ సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నంద్యాల భిక్షంరెడ్డి, మాజీ సర్పంచులు గంగుల వెంకటరాజిరెడ్డి, కడారి సత్తయ్య, గుత్తా నర్సింహారెడ్డి, కడమంచి సంధ్యస్వామి, ఎండీ రెహాన్‌, నాయకులు అక్రం, గోదాసు పృథ్వీరాజ్‌, గాదె శోభారాణి, మేకల మల్లేశం, నాగులంచె నరేష్‌, దూదిమెట్ల లింగస్వామి, మేడి మల్లయ్య, అయ్యాడపు నర్సిరెడ్డి, ఎండీ జమీరొద్దీన్‌, గడ్డం యాదగిరి, ఏఈలు విక్రమ్‌, అమర్‌, వర్క్‌ ఇన్‌స్పెపెక్టర్‌ రజినీకాంత్‌, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాదూరి శంకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ చామల మహేందర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్‌, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు చామల వెంకటరమణారెడ్డి, జయపాల్‌రెడ్డి, చాడ రమేశ్‌చందర్‌రెడ్డి, దండ అశోక్‌రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్‌ ఇంతియాజ్‌, రైతులు తదితరులు ఉన్నారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement